![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -691 లో... గుడిలో రాజ్ ని చూస్తుంది కావ్య. ఎక్కడ తన అత్త మామ రాజ్ ని చూస్తారోమని కంగారుపడుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి రాజ్ ని చూసి పూజ జరుగుతున్న దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని తన వాళ్ళకి రాజ్ ఉన్నాడని చూపిస్తుంది. దాంతో అందరు రాజ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతారు. అదంతా చూసి యామిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.
తను మా ఆయన రాజ్.. తనకి గతం గుర్తు లేదని యామిని చెప్తుంది. అంత యామిని చేస్తున్నా కుట్ర అని కావ్య చెప్తుంది. అందరు రాజ్ చుట్టూ చేరి ఏదో ఒకటి మాట్లాడుతున్నట్లు రాజ్ కళ్ళు తిరిగి కిందపడిపోయినట్లు కావ్య ఉహించుకుంటుంది. అలా జరగకూడదు అత్తయ్య వాళ్ళ ఎవరు కూడా ఆయన్ని చూడొద్దని యామినికి కావ్య ఎదరుపడితే తనే ఇక్కడ నుండీ తీసుకొని వెళ్తుందని అక్షింతలు అందరికి ఇస్తూ యామిని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కావ్యని చూసి యామిని షాక్ అవుతుంది. ఇదేంటీ ఇక్కడ ఉంది అనుకుటుంది. కావ్యతో రాజ్ మాట్లాడతాడు.
మా వాళ్లు అంత వచ్చారని రాజ్ కి కావ్య చెప్తుంది. రాజ్ అటుగా చూస్తుంటే అందరు అటు వైపు తిరిగి ఉంటారు. తరువాయి భాగం లో కావ్య వెళ్తుంటే ఎక్కడ యామిని చూస్తుందోనని రాజ్ తనని పక్కన గదిలోకి తీసుకొని వెళ్తాడు. అప్పుడే పూజరి వచ్చి గది తాళం వేస్తాడు. అయ్యో అక్కడ పూజ జరుగుతుందని కావ్య టెన్షన్ పడుతుంటే.. మీకు పూజ జరగాలి కదా అంటూ ఆ గదిలో ఉన్న దేవుడు ఫొటోస్ సెట్ చేసి పూజకి రాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |